బోర్డులకే పరిమితమైన ‘ఉచిత గాలి’

ప్రజాశక్తి – ఆకివీడు

పెట్రోల్‌ బంకుల వద్ద పెట్రోల్‌తో పాటు వినియోగదారుల సౌకర్యార్థం వారి టైర్లకు అవసరమైన గాలి సౌకర్యం కూడా బంకుల వద్ద కలిగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అయితే సుమారు దశాబ్ద కాలం నాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మేరకు దేశమంతటా పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారుల వాహనాలకు గాలి కొట్టే ఏర్పాట్లు చేశారు. ఈ సౌకర్యం వారికి ఉచితం. అక్కడ ఒక మనిషి కూడా ఉండాలి ఆ మనిషి వచ్చిన వాహనాలు గాలి కొట్టాలి. అది ప్రభుత్వ నిబంధన. ఆ నిబంధన ఇప్పుడు గాలికి వదిలేశారు. గాలికొట్టే ఎయిర్‌ బాక్సులు బోర్డులకు మాత్రమే పరిమితమయ్యాయి. గాలి కొట్టే యాంత్రీకరణ విధానం గాలికిపోయింది. ఇక అక్కడ మనిషి ఉండే ప్రసక్తే లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ బోర్డులు, ఖాళీ డబ్బాలు మాత్రమే మిగిలాయి. ఇది ఒకటే కాదు ప్రభుత్వ నిబంధనలు సర్వత్రా ఖాళీ బోర్డులే కనిపిస్తున్నాయి.

➡️