చాంబర్ కళాశాలలో స్వర్ణోత్సవ భవనాలు ప్రారంభం

Feb 28,2024 15:08 #West Godavari District
Inauguration of Swarnatsava buildings at Chamber College

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ కళాశాలలో రూ 2 కోట్ల ఖర్చుతో నిర్మించిన నూతన స్వర్ణోత్సవ భవనాలను చాంబర్ అధ్యక్షులు కారుమూరి నర్సింహారావు ప్రారంభోత్సవం చేసారు. పలువురు దాతల సహకారంతో ఈ భారీ బిల్డింగులు నిర్మించారు. సెక్రటరీ కలిదిండి రామరాజు బిల్డింగ్ నిర్మాణం కు తీవ్ర కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో విద్య ఉండటానికి చాంబర్ 50 సంవత్సరాల నుండి కృషి చేస్తోందని చెప్పారు. ఇంకా చాంబర్ జనరల్ సెక్రెటరీ దేవరపల్లి లక్ష్మీనారాయణ , కోశాధికారి ఎన్ వి సత్యనారాయణమూర్తి, అడిషనల్ చైర్మన్ తటవర్తి కృష్ణ మూర్తి, కోశాధికారి జల్లూరి రామలింగేశ్వర రావు , పెద్దిబొట్ల లక్ష్మీ నారాయణ, డా చినిమిల్లి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డా వెంకటేశ్వరరావు, పట్టణ ప్రముఖులు , వర్తకులు తదితరులు పాల్గొన్నారు.

➡️