రాయిపేటలో జనంలోకి జనసేన

Mar 20,2024 12:44 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా ): జనసేన, తెదేపా, బీజేపీ కూటమితో ప్రభుత్వంతోనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయని జనసేన నరసాపురం ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని 23 వార్డ్ రాయిపేటలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. వార్డు లోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్య లు తెలుసుకున్నారు. ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఘంటా కృష్ణ, పోలిశెట్టి నళిని, అడబాల రమేష్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, గుబ్బల మార్రాజు, బందెల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️