మాంటీస్సోరీస్ స్కూల్ కు డియా బుక్ ఆఫ్ రికార్ద్ 

Feb 4,2024 12:13 #West Godavari District
Montessori School Ku Dia Book of Record

ప్రజాశక్తి-పాలకొల్లు : ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్న ఉల్లంపర్రు మాంటిస్సొరిస్ స్కూల్. భారత ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు మరో 3 సరికొత్త రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. దేశంలో అతి పెద్ద సైన్స్ ప్రదర్శనగా 632 ప్రాజెక్ట్స్ తో, 650 మంది విద్యార్దులతో, 1 కిలోమీటర్ పొడవున ఏర్పాటు చేసిన భారీ సైన్స్ ప్రదర్శనగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కించుకుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ను అగ్రికల్చర్ శాస్త్రవేత్త డా.కె సరళ చేతుల మీదుగా ఆదివారం అందించారు. ఆమె మాట్లాడుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇప్పటి వరకు 40,000 మందికి చోటు దక్కిందని, ఇటువంటి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది మాత్రం ఉల్లంపర్రు మాంటీస్సోరీస్ స్కూల్ అని చెప్పారు. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా మంచి ప్రాజెక్ట్స్ పెట్టారని విద్యార్దులు పెట్టిన ప్రాజెక్ట్స్ లో పిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్, మాథెమాటిక్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగకర పాఠ్యాంశాలలోని విషయాలు గురించి ఏర్పాటు చెయ్యడం కాకుండా ప్రాజెక్టు గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారని అన్నారు. విద్యార్దులను చూస్తుంటే తన బాల్యం గుర్తొచ్చిందని అన్నారు. ఈరోజుల్లో తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులు సొసైటీలో చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయని ఇటువంటి సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం వలన విద్యార్దుల ప్రతిభను కనబర్చడానికి మంచి వేదిక అవుతుందని అన్నారు. పిల్లలకు ఇటువంటి విషయాల పై అవగాహన కల్పించాలని అన్నారు. ఉల్లంపర్రు మాంటీస్సోరీస్ అధినేతలు అకడమిక్ డైరెక్టర్ మద్దాల వాసు, సెక్రెటరీ & కరస్పాండెంటు మద్దాల రాంప్రసాద్, స్కూల్ ప్రిన్సిపాల్ వసంత లక్ష్మికి రికార్డు అవార్డు ను అందించారు.

➡️