కులగణన సర్వేలో కన్వర్ట్ క్రిస్టియన్లకు అన్యాయం

Jan 31,2024 14:38 #West Godavari District
protest against caste census

ప్రజాశక్తి – కాళ్ళ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వేలో కన్వర్ట్ క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుందని ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రేడ్(ఎఫ్ ఎఫ్ సి ఐ ) రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల తాసిల్దార్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈధర్నాలో ఎఫ్ ఎఫ్ సి ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఇస్మాయేల్ మాట్లాడుతూ కులగణన విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్టు కనిపించడం లేదని, వలంటీర్ల ద్వారా కులగణన సర్వే చేయించడం బాధ్యతారాహిత్యమన్నారు. కులాల వారీ లెక్కల సేకరణ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొంతమంది వాలంటీర్లు ఇంటింటికి వచ్చి కుల గణన సర్వే సక్రమంగా చేయడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక మండలాల్లో జరుగుచున్న కులగణన సర్వే పారదర్శకంగా జరగడం లేదన్నారు. అధికారులు, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి కలగణన సర్వే నిర్వహించలేదన్నారు. సర్వేలో పొందుపరిచిన విషయాలు తెలియపరచకుండా సంబంధిత అధికారుల ప్రోత్సాహంతో వాలంటీర్లు ఫోన్లు చేసి ఓటిపి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల ఇష్ట ఇష్టాలతో పని లేకుండా కుటుంబాల్లో ఉన్న వారందరి ఓటీపీలను నమోదు చేసి మతానికి మతానికి సంబంధించిన ఆప్షన్ ఉంది. క్రైస్తవులకు కుటుంబాలకు సంబంధించిన కులగణన సర్వేలో క్రిస్టియన్ మతం అని నమోదు చేయడం లేదు. కులగణన సర్వే సక్రమంగా చేయని అధికారులు, వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని, కాళ్ల మండలంలో కులగణన రీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. కులగణన రీ సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళమన్నారు. కాళ్ల తాసిల్దార్ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కులగణన రీ సర్వే చేపట్టాలని ఎంపీడీవో ఎమ్మెస్ ప్రభాకర్ రావు, తాసిల్దార్ టీఏ కృష్ణారావులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ ధర్నాలో కన్వర్ట్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పిఎస్ సుందర్రావు, కన్వీనర్ వై సాల్మన్ రాజు, కార్యదర్శి కే సురేష్ బాబు, ఎఫ్ ఎఫ్ సి ఐ కార్యదర్శి కే విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు బి పురుషోత్తం, ఉండే సమన్వయకర్త హేమ కుమార్, ఆకివీడు పొలిటికల్ ఇన్చార్జ్ సురేష్ పాల్, వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

➡️