సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన

Jan 19,2024 15:46 #West Godavari District
road construction works start

ప్రజాశక్తి -కాళ్ళ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని నియోజకవర్గ వైసిపి ఇంఛార్జి, డిసిసిబిచైర్మన్ పి. వి. ఎల్ నరసింహారాజు అన్నారు.ప్రాతళ్ళమెరక గ్రామంలోఆర్ అండ్ బి రహదారి లో సిమెంట్ రోడ్డు పనులకు ఉండి నియోజకవర్గ వైసిపి ఇంఛార్జి పి. వి. ఎల్ నరసింహారాజు శుక్రవారం శంకుస్థాపనచేశారు.జువ్వలపాలెం -కలవపూడి ఆర్ అండ్ బి రోడ్డులో ప్రాతళ్ళమెరక గ్రామంవద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు సీఎంఓ నిధులు రూ 40 లక్షలు మంజూరయ్యాయి.ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెన్మేత్స శిరీష విశ్వనాధరాజు, ప్రాతళ్ళమెరక గ్రామ వైసీపీ అధ్యక్షులు వేగేశ్న బాల గణపతి వర్మ, వైసీపీ నాయకులు సాగిరాజు హరి వర్మ,కంతేటి సుబ్బారాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️