అత్తతో కలిసి అల్లుడి ప్రచారం

ప్రజాశక్తి – నరసాపురం

మామ కోసం అత్తతో కలిసి అల్లుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరసాపురంలో వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు గెలుపు కోసం వారి కుటుంబ సభ్యులంతా ప్రచారం చేపట్టారు. పట్టణంలోని ఏడో వార్డులో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసాదరాజు సతీమణి శారదావాణి, ఆయన అల్లుడు డాక్టర్‌ అనిర్విన్న అడ్డురి ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి మరలా జగన్‌ను సిఎంను చేయాలని ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో యర్రా శ్రీను, రవితేజ పాల్గొన్నారు.

➡️