పెన్షన్లు ఇంటి వద్దే అందించాలి

ఎంపిడిఒ శాస్త్రి

ప్రజాశక్తి – ఉంగుటూరు

వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచిన సామాజిక పెన్షన్లను ఇంటివద్దె లబ్ధిదారులకు నేరుగా అందించాలని ఉంగుటూరు ఎంపిడిఒ శాస్త్రి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండలంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఉంగుటూరు మండలంలోని 25 గ్రామ సచివాలయాల్లో 11,695 మంది పెన్షన్‌ దారులు ఉన్నారు. వారందరికీ పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది 211 మంది సిబ్బంది ఉన్నారు. సచివాలయ ఉద్యోగి ఒక్కొక్కరికి 50 నుంచి 55 వరకు లబ్ధిదారుల మ్యాపింగ్‌ ప్రక్రియ శుక్రవారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఎంపిడిఒ ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది చాలకపోతే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని వినియోగించుకోవాలని ఆయన ప్రభుత్వ విధి విధానాలను వివరించారు. ఈ సమావేశంలో సూపరిండెంట్‌ ఆంజనేయులు, సీనియర్‌ అసిస్టెంట్‌ ఫణి కుమార్‌ పాల్గొన్నారు.

➡️