యువత అభివృద్ధి చెందాలి

ఎంఎల్‌ఎ సొంగా రోషన్‌ కుమార్‌

ప్రజాశక్తి – చింతలపూడి

చిరు వ్యాపారాలతో యువత అభివృద్ధి చెందాలని చింతలపూడి ఎంఎల్‌ఎ సొంగా రోషన్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని యర్రగుంటపల్లి గ్రామంలో ఫ్రెండ్లీ ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతున్న యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చిరు వ్యాపారాలతో కుటుంబానికి తోడుగా ఉండాలన్నారు. కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు ఎంతో మందికి మిషన్‌ హోప్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆర్థిక సాయం చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి భాస్కరరావు పాల్గొన్నారు.

➡️