సురక్ష పేజ్-2 శిబిరం

Mar 7,2024 12:27 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): సురక్ష శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 31 వార్డ్ సచివాలయంలో వద్ద సురక్ష పేజ్ -2 శిబిరాన్ని కమీషనర్ గురువారం ప్రారంభించారు. అనంతరం సురక్ష శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నమన్నారు. యు పి హెచ్ సి డాక్టర్ శిరిగినీడి భాస్కర్ భూషణ్ వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ ఏడిద కోట సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️