విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి 

Feb 19,2024 12:20 #West Godavari District
Those who attacked journalists should be arrested immediately

ఉండి ప్రెస్ క్లబ్
ప్రజాశక్తి-ఉండి : అనంతపురం జిల్లా రాప్తాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలో ముఖ్యమంత్రి సాక్షిగా విలేకరులపై దాడి చేసిన వైసిపి శ్రేణులపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఉండి ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఈతకోట యాకోబు రాజు డిమాండ్ చేశారు. సోమవారం ఉండి మెయిన్ సెంటర్లో విలేకరులపై దాడికి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉండి ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిస్వార్ధంగా విలేకరులు పనిచేస్తున్నారని అటువంటి విలేకరులపై దాడి చేయడం అమానుషమన్నారు. ప్రెస్ క్లబ్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఉండి మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తుగ నాగరాజు సంఘీభావం తెలియజేసి అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం మీడియాకు కొన్ని హక్కులను కల్పించిందని వాటిని విచ్ఛిన్నం చేసే విధంగా మీడియాపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే మీడియాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి ప్రెస్ క్లబ్ కోశాధికారి జామి అంజిబాబు, ఉపాధ్యక్షులు శేషాపు మణికంఠ, సభ్యులు దుండి కృష్ణమోహన్, బురిడీ సురేష్ బాబు, బొండాడ సత్యనారాయణ, తాడి వెంకటరమణ, గజ్జెల కేశవ, కైలే రాజు, గడి నరేంద్ర, దుర్గాప్రసాద్, నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, చెన్నంశెట్టి ప్రసాద్, కరిమెరక శ్రీను ( చినబాబు), నల్లమాటి రమేష్, పెదపాటి ప్రసాద్, మోపిదేవి హరి, కంది దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️