వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేసుకోవాలి

జిల్లా వైద్యశాఖ అధికారి మహేశ్వరరావు

ప్రజాశక్తి – గణపవరం

వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారి డి.ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంలో బిపి, షుగర్‌ ఉన్నవారు తప్పనిసరిగా మందులు తీసుకొని తగిన వైద్యం పొందాలని అన్నారు. గర్భిణీ స్త్రీలు మూడు నెలల్లోపు నమోదు చేసి వారికి తగిన సేవలందించాలని తెలిపారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లోరినేషన్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు వివరించారు. అనంతరం సరిపల్లిలో ఉన్న వడ్డీ గూడెం ఏరియాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి.సంతోష్‌ నాయుడు, పి.కిరణ్మయి, కమ్యూనిటీ హెల్త్‌ అధికారి జాలాది విల్సన్‌ బాబు, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, ఎంఎల్‌ హెచ్‌పిలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️