నీరే మానవునికి జీవనాధారం

Mar 22,2024 14:21 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): ప్రపంచ జలదినోత్సవం పురస్కరించుకుని నరసాపురం యుకె వనితా క్లబ్ వారు నీటి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వ్యాస రచన పోటీ నిర్వహించి బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, వనితాక్లబ్ రీజనల్ చైర్ పర్సన్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా.శిరిగినీడి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచంలో నీరు 70 శాతం అని, దానిలో మంచినీరు 3 శాతం అని, అందువలన భవిష్యత్ తరాల కోసం నీటిని పొదుపు చేయవలిసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నీరే మానవునికి జీవనాధారం అని, నీరు లేకపోతే మనిషి మనుగడే లేదని తెలిపారు. అధ్యక్షురాలు పుప్పాల ఉమా మహేశ్వరి మాట్లాడుతూ పంచ భూతాలు ఒకటైన నీటిని సంరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ సంవత్సరం 10 వ తరగతి విద్యార్థులకు 40 రోజుల పాటు 3, 000 రూ విలువగల సాయంకాలం స్నాక్స్ అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బండి స్వర్ణలత, ఉపాధ్యక్షురాలు పుస్పాల ఉషా కమల, సుంకర రాజకుమారి, గంటా వెంకట రమణ, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

➡️