పరిపాలన సులభతరం చేశాం

Apr 8,2024 11:27 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):  పరిపాలన సులభతరం కోసం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని కొప్పర్రు గ్రామంలో 21వ రోజు ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో ప్రసాదరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కాలేజి తీసుకొచ్చామన్నారు. పక్కనే సుమారు రూ.332 కోట్లతో ఆక్వా యూనివర్సిటీ నిర్మిస్తున్నామన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలందరూ మద్దతు తమ పార్టీకే ఉందన్నారు. ఈ ఐదేళ్లలో ప్రజాశ్రేయసు, ప్రజాసంక్షేమ కోసమే పనిచేసామన్నారు.

➡️