ఇళ్ళు మంజూరు చేస్తాం

Mar 1,2024 11:53 #West Godavari District
We will grant houses
  • అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర చీఫ్ విప్ హామీ 

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రభుత్వ పరంగా ఇళ్ళు మంజూరు చేస్తామని, నష్టపరిహారాన్ని అందిస్తామని రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని తూర్పుతాళ్ళు గ్రామంలో సైపు వారి మెరకలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులు ఆకుల సత్యనారాయణ, కొండేటి లక్ష్మీ లను ఎమ్మెల్యే ప్రసాదరాజు కలిసి మాట్లాడారు. ధైర్యంగా ఉండండి… ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద బాధితులకు తక్షణ సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు ప్రసాదరాజు అందించారు.స్థానికులు, అధికారులను ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

➡️