ఎక్కడి చెత్త అక్కడే

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాజంపేట మున్సిపాలిటీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి కంపు కొడుతోంది. ఇటీవలే కొనుగోలు చేసిన 15 చెత్త సేకరణ వాహనాలలో సుమారు 8 వాహనాలు రిపేరుకు వచ్చి మూలన పడ్డట్లు సమాచారం. కొన్ని నెలల్లోనే వాహనాలు రిపేరుకు రావడంపై సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. సుమారు రెండు నెలలు 8 చెత్త సేకరణ ఆటోలతో పాటు రెండు మినీ ట్రాక్టర్లు మరమ్మ తులకు నోచుకోక మూలన పడ్డారు. దీంతో రాజంపేట పట్టణంలో ఎక్కడి కక్కడ చెత్త పేరుకుపోయి పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ము ఖ్యంగా బాలాజీ నగర్‌లోని చెత్త పాయింట్‌ వద్ద చెత్తంతా సగం రోడ్డును ఆక్ర మిం చడంతో వాహన చోదకులు, పాద చారు లు రాకపోకలను ముక్కుమూసుకొని దుర్గంధాన్ని భరిస్తూ వెళుతున్నారు. చెత్త సగం రోడ్డుకు ఉండటంతో ఆ దారిన కేవ లం ఒక వాహనం మాత్రమే వెళ్లేం దుకు వీలుంటోంది. చాలా రోజులుగా చెత్త తొల గించకపోవడంతోనే ఇలా పేరు కుపో యిందని స్థానికులు చెబు తున్నారు. పక్కనే మురుగు కాలువ కూడా ఉండ డంతో చెత్త, మురుగునీటితో కలిసిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు చెత్తను తొల గించాలని ప్రజలు కోరురుతున్నారు. చెత్త సేకరణ వాహనాలకు మరమ్మతులు చేప ట్టి పట్టణవ్యాప్తంగా పారిశుధ్యంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని పట్టణ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

➡️