హ్యాట్రిక్‌ కొడతారా!

వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థులు హ్యాట్రిక్‌ సాధించడంపై అందరి దృష్టీ నిలిచింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రతిఘటన లేకుండా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో సారి కడప, రాజంపేట సిట్టింగ్‌ ఎంపీలు వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి కాంగ్రెస్‌ , టిడిపి, బిజెపి అభ్యర్థుల నుంచి సవాల్‌ ఎదురుకానుంది. కడప పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌. అవినాష్‌రెడ్డికి ప్రత్యర్థులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ కుమార్తె వైఎస్‌. షర్మిల కాంగ్రెస్‌, చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి టిడిపి తరుపున నిలువనున్నారు. వైఎస్‌ కుటుంబం నుంచే ఇద్దరు అభ్యర్థులు తలపడుతున్న నేపథ్యం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్య అజెండాగా సాగుతున్న ఎన్నికల నేపథ్యంలో సానుభూతి రాజకీయం రంజుగా మారింది.

➡️