తెలుగుదేశం పార్టీని గెలిపించండి

ప్రజాశక్తి-పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలం తెల్లగట్ల, ముటుకుల, అక్కపాలెం, శతకోడు గ్రామాలలో గురువారం టిడిపి మండల కన్వీనర్‌ పయ్యా వుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూ రి ఎరిక్షన్‌బాబు కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా, డాక్టర్‌ మన్నె రవీంద్ర కోడలు మన్నె రాధిక పాల్గొన్నారు. గ్రామాలలో భారీ స్థాయిలో మహిళలు రోడ్‌ షో నిర్వహించి హారతులు, పూల వర్షంతో వారికి స్వాగతం పలికారు. ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో యర్రగొండ పాలెం నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి అయినా జరిగిందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ముటుకుల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు నీరందిస్తామని తెలిపారు. ఒక్కసారి ఎరిక్షన్‌బాబుపై నమ్మకంతో ఒక్క అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి సాధిద్దామని, మన పిల్లల భవిష్యత్తు మార్చుకుందామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బివి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️