పేదల సంక్షేమానికి కృషి : కరణం

ప్రజాశక్తి – చీరాల : పేదల సంక్షేమానికి ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కృషఙ చేస్తున్నట్లు వైసిపి చీరాల నియోజక వర్గ అభ్యర్థి కరణం వెంకటేష్‌ తెలిపారు. మండల పరిధిలోని తోటవారిపాలెం చంద్రమౌళి కాలనీ, రంగారావుపేటలో వైసిపి నాయకులు, కార ్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ సచివాలయ, వాలంటీరు వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల వద్ద అందిస్తున్న ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి అధ్యక్షుడు ఆసాది అంకాల రెడ్డి, గుత్తి శ్రీనివాసరావు, అందే సాంబయ్య, గోలి సుబ్బయ్య, అవ్వరు రాంబాబు, ఉట్ల నారాయణ, జన్జనం సుబ్బారావు, నాదెండ్ల కోటేశ్వరరావు, గుమ్మడి చిన్న బాబు,పర్వతనేని శ్రీనివాసరావు, నాదెండ్ల ప్రతాప్‌,దేవరపల్లి బాబురావు, జానా చిరంజీవి,గుమ్మడి సంజీవరావు, గుమ్మడి దేవరాజు, మార్పు ఇరిమియా తదితరులు పాల్గొన్నారు.

➡️