బారాషాహిద్‌ దర్గా అభివృద్ధిపై కృషి

Jun 17,2024 20:39
బారాషాహిద్‌ దర్గా అభివృద్ధిపై కృషి

బారాషాహిద్‌ దర్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న మంత్రులు, ఎంపి
బారాషాహిద్‌ దర్గా అభివృద్ధిపై కృషి
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని బారాషాహిద్‌ దర్గాను పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిలతో కలిసి రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి సహకారంతో భవిష్యత్తులో బారాషాహీద్‌ దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్‌ పండుగ అందరి ఇళ్లల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.వారి వెంట జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌తో పాటు ముస్లిం మత పెద్దలు, తదితరులున్నారు.

➡️