వైసిపి పూర్తిగా విఫలం

May 1,2024 21:47

ప్రజాశక్తి-బొబ్బిలి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో బుధవారం వారు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలో మౌలిక సౌకర్యాలు కల్పనకు బేబినాయనను గెలిపించాలని సుజయకృష్ణ కోరారు. ప్రచారంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్‌, కౌన్సిలర్‌ బి.శ్రీదేవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామాల్లో టిడిపి ప్రచారం

 ప్రజాశక్తి-వేపాడ : మండలంలోని బక్కునాయుడుపేట, రాయుడుపేట గ్రామాల్లో టిడిపి అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ మహిళా నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి భారతి, ఎస్‌టి సెల్‌ నాయకులు దాసరి లక్ష్మి, మహిళా సంఘాల అవేర్‌నెస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ గొంప తులసి, కోళ్ల ఉషశ్రీ, జి.సుదానాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️