వైసిపితోనే ముస్లింల అభివృద్ధి :’గడికోట’

ప్రజాశక్తి-చిన్నమండెం ముస్లింల అభివృద్ధికి కృషి చేసేది వైసిపి ప్రభుత్వమేనని రాయ చోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని బోనమల గ్రామంలోని బోనమల కస్పా, కనకంటి వారిపల్లె, దళితవాడ, గొల ్లపల్లె, పాలెంనగరి, సీపోలిమేరపల్లెలో జడ్‌పి మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథ్‌రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ నాడు స్వర్గీయ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని, నేడు సిఎం జగన్‌ మైనార్టీల అభ్యున్నతికి కషి చేస్తున్నారని అన్నారు. ఉర్దూను రెండో అధికారభాషగా గుర్తించారని, ప్రభుత్వ, నామినేటెడ్‌ పదవుల్లో ఊహించని విధంగా మైనార్టీ లకు అగ్రతాంబూలం ఇచ్చారని అన్నారు. సబ్‌ప్లాన్‌ ఏర్పాటు, మౌజం, ఇమామ్‌ సంక్షేమానికి సిఎం జగన్‌ ఎంతో కృషి చేశారని కొనియాడారు. సంక్షేమ పాలన ఇలాగే కొనసాగాలంటే వైసిపికి అండగా నిలవాలని కోరారు. ఎటుంటి లంచాలు లేకుండా పారదర్శకంగా పాలనను అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును వృద్ధులకు పింఛన్లను అడ్డుకోవాలని ప్రయత్నించారని అయినా పింఛన్లను అందిస్తున్నామన్నారు. వాలంటీర్లపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైసిపి పేదల పక్షపాత ప్రభుత్వమని మరల జగన్‌ సీఎం అయితే ప్రజారంజక పాలన అందుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోమారు వైసిపికి అండగా నిలిచి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్‌రెడ్డిని గెలిపించాలన్నారు. కార్యక్ర మంలో సింగల్‌ విండో అధ్యక్షుడు గోవర్ధన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు లోకేశ్వర్‌రెడ్డి, ఆఫ్రోజ్‌, మండల నాయకులు బాబురెడ్డి, ఎంపిటిసి వెంక టప్ప నాయుడు, వైస్‌ ఎంపిపి ఎజాస్‌అలీఖాన్‌, ఎంపి టిసి రమేష్‌, నరసయ్యస్వామి, కురబ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రమణ, సర్పంచ్‌ లక్ష్మిరెడ్డి, నాగశేషా రెడ్డి, మాజీ సర్పంచ్‌ అమ్మాజీ, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ అంజనప్ప నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️