తుఫాను వల్ల దెబ్బతిన్న ఇళ్ల పరిశీలిన

Dec 7,2023 11:55 #East Godavari
ycp leader visit cyclone effeted house

వైసీపీ మండల కన్వీనర్ పాటి రాంబాబు
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని రంపఎర్రంపాలెం దళిత వాడలో తుఫాను ఉదృతంగా వల్ల కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇళ్లులను, గ్రామం మధ్యలో నుండి వెళ్లి కాలువలు గండి కొట్టడంతో గురువారం గోకవరం మండల వైసీపీ కన్వీనర్ పాటి రాంబాబు వైసీపీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి, ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తుఫాను వల్ల కాలువ ఉధృతంగా ప్రవహించడం వల్ల కాలువకు గండి కొట్టడం జరిగిందని, వర్షం వల్ల కూలిపోయిన ఇళ్ల బాధితులును ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులుకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ తడిచిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవడం జరుగుతుందని, ఇప్పటికే తడిసి ధాన్యం, పచ్చి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడానికి జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులు అందరూ అధైర్యం పడవద్దని ప్రభుత్వం అన్ని విధాలా అడుకొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మాజీ సర్పంచ్ తొట్ట సత్యనారాయణ మాజీ ఉప సర్పంచ్ పాటి అప్పలరాజు, వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

➡️