జోనల్‌ కార్యాలయ పునర్నిర్మాణంవేగవంతం

జివిఎంసి కమిషనర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ

జివిఎంసి కమిషనర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ

ప్రజాశక్తి-పిఎం పాలెం: జివిఎంసి రెండవ జోనల్‌ కార్యాలయం పునర్నిర్మాణం, ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని జివిఎంసి కమిషనర్‌ సీఎం సాయికాంత్‌వర్మ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మధురవాడలోని జోన్‌-2 కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న కార్యాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి, కార్యాలయమంతా ఆకర్షణీయమైన ఆకృతులతో నిర్మాణం చేపట్టి, అధునాతన ఫర్నిచర్‌, విద్యుత్తు, కేబుల్‌ వైర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యాలయం పక్కన ఉన్న సౌకర్య కేంద్రం (సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌)ను పరిశీలించి నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ఐటి సెజ్‌ వద్ద ఆదిత్య అపార్టుమెంట్‌ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐటి సెజ్‌ పార్కును సందర్శించారు. పార్కులోని పనులను, సమీపంలోని టెన్నిస్‌ కోర్టు పార్కు పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జివిఎంసి ఎస్‌ఇ శాంసన్‌ రాజు, ఇఇ శాంతిరాజ్‌లను ఆదేశించారు. ఐటి సెజ్‌ రోడ్లపై ఉన్న అనధికార బడ్డీలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కమిషనర్‌ సాయికాంత్‌వర్మ ఆదేశించారు.పర్యటనలో ఎడిహెచ్‌ సురేష్‌, ఎఎంహెచ్‌ఒ డాక్టర్‌ కిషోర్‌, డిఇఇ వంశీ, ఎఇఇ శ్రీధర్‌ పాల్గొన్నారు.

కార్యాలయ పునర్నిర్మాణ పనులపై సూచనలిస్తున్న కమిషనర్‌

➡️