మహిళా ఓటర్ల ప్రభంజనం!

May 19,2024 05:30 #Articles, #edit page

ఏ రంగంలోనైనా మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి చెందితే ఆ రంగం ప్రగతి బావుటా ఎగురవేయడం ఖాయం. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ, ఎన్నికలలో మహిళా ఓటర్లు అత్యధికంగా నిలిచి ఈ మారు సెభాష్‌ అనిపించు కున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ మారు ఎన్నికలలో మహిళలు అత్యధికంగా ఓటు వేయడం కీలకమైన అంశం. మన రాష్ట్రంలో 1,69,08,684 మంది మహిళా ఓటర్లు వున్నారు. తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్న పురుష ఓటర్లు కంటే మహిళలు 4,78,535 మంది అధికంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని రికార్డు సృష్టించారు. 81.86 శాతం ఓటు వేయడం ద్వారా వీరు రికార్డు అధిగమించారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లో 4.97 లక్షలు మంది తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఓట్లలో కూడా మహిళా ఓట్ల ప్రభావం ఉంది. ఏదేమైనా అధికారంలోకి ఎవరు రావాలనేది నిర్ణయించేది మహిళా మణుల ఓట్లే అనడంలో సందేహం లేదు.

– ఎల్‌. ప్రఫుల్ల చంద్ర, ధర్మవరం.

➡️