ఎవరు గెలిచినా…!

Jun 5,2024 05:20 #edite page, #kavithalu

ఎవరు గెలిచినా చెత్త పన్ను తీసెయ్యాలి.
ఎవరు గెలిచినా కరెంటు రేట్లు తగ్గించాలి.
ఎవరు గెలిచినా ఒకటో తేదీకి వృద్ధాప్య పెన్షను ఇవ్వాలి.
ఎవరు గెలిచినా అన్నా క్యాంటీన్‌ తెరవాలి.
ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు కొట్టెయ్యకూడదు.
ఎవరు గెలిచినా మంత్రుల ప్రయాణంలో ట్రాఫిక్‌ జాం చెయ్యకూడదు.
ఎవరు గెలిచినా ప్రశ్నిస్తే అరెస్టు చెయ్యరాదు.
ఎవరు గెలిచినా ప్రభుత్వ కార్యాలయాలలో పని త్వరగా జరిగేటట్లు, లంచం తీసుకోకుండా పనులు జరిగేటట్లు అదేశాలు ఇవ్వాలి.
ఎవరు గెలిచినా గతంలో మాదిరి ప్రభుత్వ కార్యాలయాలలో
వాస్తు పేర జరిగే డబ్బు దుర్వినియోగాన్ని ఆపాలి.
ఎవరు గెలిచినా దొంగబాబాల ఆశ్రమాల గుట్టు రట్టు చేయాలి.
ఎవరు గెలిచినా విశాఖలో స్వరూపానందకు ఇచ్చిన భూముల జీవో రద్దు చెయ్యాలి.
ఎవరు గెలిచినా ముడు సంవత్సరాల క్రితం దొంగ రామదూత ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రిన్సిపల్‌ సెక్రటరి ఇచ్చిన ఆదేశాలు అమలుపరచాలి.
ఎవరు గెలిచినా దొంగబాబాల ఆశ్రమాల చుట్టూ మంత్రులు, ఐఏఎస్‌ లు, ఐపీఎస్‌ లు తిరగకుండా, రాజ్యాంగంలో రాసుకున్న లౌకికవాదాన్ని రక్షించాలి.
ఎవరు గెలిచినా దొంగబాబాలు ఇప్పటీకే ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి.
ఎవరు గెలిచినా మూఢనమ్మకాల నిర్మూలనకు ఒక చట్టం
కర్ణాటక, మహారాష్ట్రలో మాదిరి తీసుకురావాలి.

– నార్నె వెంకట సుబ్బయ్య

➡️