అనుచిత వ్యాఖ్యలపై త్రిష దావా

Feb 23,2024 08:16 #movie, #thrisha

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎఐఎడిఎంకె మాజీ నాయకుడు ఎవి రాజుపై త్రిష న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు పరువునష్టం దావా వేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆ వివరాలను ఆమె పంచుకున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవీ రాజు … త్రిషను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిష అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా త్రిష స్పందిస్తూ అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండటం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తంచేశారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. అన్నట్లుగానే భారీమొత్తం నష్టపరిహారంగా చెల్లించాలంటూ లీగల్‌ నోటీసులు పంపారు.

➡️