అభిమానుల రుణం తీర్చుకోలేను

Nov 29,2023 19:05 #movie, #sudheer

బుల్లితెర నటుడు సుధీర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్‌ పతాకాలపై అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాలీషా హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్‌ 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి, దర్శకుడు దశరథ్‌, బమ్మరిల్లు భాస్కర్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘నాకు మంచి పాత్రను, సవాల్‌తో కూడుకున్న పాత్రను ఇచ్చిన అరుణ్‌ గారికి థాంక్స్‌. నాలోని ఇంకో కోణాన్ని చూపించే పాత్ర వచ్చింది. డాలీషాతో పని చేయడం ఆనందంగా ఉంది. గెటప్‌ శ్రీను అనే వాడు.. వేణు అన్న దగ్గరికి వెళ్లమని చెప్పకపోతే.. మల్లెమాల టీం, జబర్దస్త్‌ లేకపోతే.. మీ అభిమానం నాకు దక్కేది కాదు. వాళ్ల వల్లే మీ అభిమానం దొరికింది. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేను. ఇకపై కొత్త కంటెంట్‌, మంచి సినిమాలు తీస్తాను. కొత్త సినిమా, కొత్త ప్రయత్నం చేశాం. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. 30వ తేదీ అందరూ ఓటు వేయండి.. 1వ తేదీ మా సినిమాను చూడండి’ అని సుధీర్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

➡️