‘ఆపరేషన్‌… ‘ నుండి వందేమాతరం ప్రోమో

Jan 17,2024 19:15 #movie

సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’. ఈ చిత్రం నుండి తాజాగా ‘వందేమాతరం’ సాంగ్‌ ప్రోమోని మేకర్స్‌ విడుదల చేశారు. సుఖ్వీందర్‌ సింగ్‌ పాడిన ఈ పాటను వాఘా సరిహద్దులో విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా వాఘా బార్డర్‌లో భారత్‌, పాక్‌ సైనికుల కవాతు నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గనున్న చిత్రబఅందం, అక్కడే ఈ పాటను విడుదల చేయనున్నారు. మిక్కి జే మేయర్‌ ఈ పాటను స్వరపరిచారు. తెలుగులో అనురాగ్‌ కులకర్ణి పాడగా, హిందీలో సుఖ్వీందర్‌ సింగ్‌ పాడారు. ఎయిర్‌ ఫోర్స్‌ ఆపరేషన్స్‌కు సంబంధించిన స్టోరీతో ఈ మూవీ రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో నిర్మితమవుతోంది. ఫిబ్రవరి 16, 2024న ఈ సినిమా విడుదల కానుంది.

➡️