ఇప్పుడు తన మాట వినాల్సిన సమయం …రామ్‌ చరణ్‌

Dec 30,2023 08:31 #movie, #Ram Charan

రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు తాజాగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒకరి గురించి ఒకరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమా సెట్‌కు గంట ముందే చేరుకుంటా. త్వరగా మొదలు పెట్టి.. త్వరగా పూర్తి చేయాలనుకుంటా. గత వారం రోజుల నుంచి 16 గంటలు షూటింగ్‌లోనే ఉంటున్నా. అలా కష్టపడడం నాకెంతో ఇష్టం. నా కెరీర్‌లో కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ఆ సమయంలో ఉపాసన ఎంతో ధైర్యాన్నిచ్చింది. నేను చెప్పే ప్రతి మాట వినేది. ఇప్పుడు ఆమె చెప్పినట్లు నేను వినే సమయం వచ్చిందనుకుంటున్నా. తాను సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినా మా ఫ్యామిలీలో పూర్తిగా కలిసిపోయింది. సినిమాల విషయంలో మాత్రం మా ఇద్దరి అభిరుచులు వేరుగా ఉంటాయి. వివాహబంధం సాఫీగా సాగాలంటే సహనం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అలాగే వివాహవ్యవస్థపై గౌరవం ఉండాలి’ అని రామ్‌ చరణ్‌ చెప్పారు.

➡️