దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబినేషనల్లో ‘లక్కీ భాస్కర్’ సినిమా రూపొందుతోంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చిత్రబృందం ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు (ఫిబ్రవరి 3న) విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.