ఏప్రిల్‌ నుంచి ‘తలైవా 171”

Dec 19,2023 19:20 #lokesh kanagaraj, #movie

ప్రస్తుతం ‘తలైవా 171′ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 2024 నాటికి అవి పూర్తవుతాయి. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా. చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్‌ ఇలాంటి సినిమాలో నటించనున్నారు. ”అనిరుధ్‌, నేను వెళ్లి ఆయనకు కథ వినిపించాం. వెంటనే ఆయన నన్ను కౌగిలించుకుని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. చాలా సంతోషించాను’ అని లోకేష్‌ కనగరాజ్‌, ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా గురించి తెలియగానే మొదట కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి అభినందించినట్లు కూడా తెలిపారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషించనున్నారు.

➡️