ఏలియన్‌కి స్వరమిచ్చిన సిద్ధార్థ్‌

Dec 13,2023 19:10 #movie, #siddarth

తమిళ నటుడు శివ కార్తికేయన్‌ తాజా ప్రాజెక్టు ‘అయలాన్‌.’ సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కింది. ఈ మూవీలో ఏలియన్‌ పాత్రని సృష్టించారు. తాజాగా ఆ ఏలియన్‌ పాత్రకి వాయిస్‌ని ఇచ్చారు హీరో సిద్ధార్థ్‌. డబ్బింగ్‌ కంప్లీట్‌ చేసిన సిద్ధార్థ్‌కి థాంక్స్‌ చెప్తూ ‘అయలాన్‌’ చిత్రబృందం స్పెషల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాని రవికుమార్‌ డైరెక్ట్‌ చేశారు. రెహమాన్‌ మ్యూజిక్‌తో, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. కెజెఆర్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై కోటపాడి జె రాజేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌, యోగిబాబు, కరుణాకరన్‌, శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.

➡️