‘గీతాంజలి…’ ఫస్ట్‌ లుక్‌

Jan 6,2024 19:15 #movie, #srinivasreddy

అంజలి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. శ్రీనివాస్‌ రెడ్డి కథనాయకుడిగా, సునీల్‌, సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజలి 50వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథ, స్రీన్‌ ప్లే అందించారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

➡️