Stock market : జీవిత కాల గరిష్టానికి సెన్సెక్స్‌ , నిఫ్టీలు

Jun 27,2024 12:46 #Nifty, #sensex, #Stock Markets

న్యూఢిల్లీ :   దేశీయ మార్కెట్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు గురువారం ప్రారంభ ట్రేడ్‌లో రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్‌ 339 పాయింట్లు దాటి రూ. 79,000 జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ కూడా 97.6 పాయింట్లు దాటి రూ. 23,966 మార్కుతో ఆల్‌ టైమ్‌ రికార్డు నెలకొల్పింది.

సెన్సెక్స్‌ కంపెనీలు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్టీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, బజాబ్‌ ఫినాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మరియు టాటా స్టీల్‌ లాభపడ్డాయి. మారుతి, టెక్‌ మహీంద్రా, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ మరియు లార్సెన్‌ అండ్‌ టర్బోలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఎక్సేంజ్‌ నివేదిక ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు (ఎఫ్‌ఐఐఎస్‌) బుధవారం రూ. 3,535.43ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

➡️