‘గేమ్‌ ఛేంజర్‌’ ‘జాబిలమ్మ..’ వచ్చేసింది

Mar 27,2024 17:50 #movie, #Ram Charan

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం నుండి తాజాగా పాట విడుదలైంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 150 పైన థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. దలేర్‌ మెహందీ, సునిధీ చౌహాన్‌ ఆలపించారు.

➡️