త్వరలో కొత్త సినిమా షూటింగ్‌

Mar 12,2024 19:25 #movie, #satyanarayanaraju

త్వరలోనే కొత్త సినిమాకు షూటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ అవార్డు గ్రహీత రాజాసాగి సత్యనారాయణరాజు (కుర్రపల్లిబాబు) తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన తారాగణం, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే కథ సిద్ధం చేశామన్నారు. సమాజానికి మంచి జరిగాలనే సదుద్దేశ్యంతో కొత్త కథతో త్వరలో సినిమా తీయటానికి ఏర్పాట్లు చేస్తున్నానన్నారు. ఈ క్రమంలోనే గతేడాది తాను నిర్మించిన ‘ఒక్కడే వీరుడు (అల్లూరి సీతారామరాజు) బయోపిక్‌కు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో బెస్ట్‌ బయోఫిక్‌కు ఎంపికయ్యిందన్నారు. తనకు బెస్ట్‌ బయోపిక్‌ ప్రొడ్యూసర్‌ అవార్డును అతిథులు అందజేశారన్నారు. సినిమా చూసిన వారంతా తనకు ఎంతో ప్రశంసలు అందజేశారనానరు. తాను పొందిన అవార్డు షీల్డులను ఆయన ప్రదర్శించారు. గతంలో నాలుగు సినిమాల్లో కూడా తాను నటించానన్నారు. కొత్త సినిమా కోసం ఇప్పటికే షూటింగ్‌ స్పాట్స్‌ ఎంపిక చేశామన్నారు.

➡️