త్వరలో తాప్సీ వివాహం

Feb 28,2024 19:30 #movie, #tapsi

హీరోయిన్‌ తాప్సీ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా సమాచారం. ఢిల్లీకి చెందిన తాప్సీ ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించారు. తర్వాత ఇక్కడే కొన్ని సినిమాల్లో నటించారు. అనంతరం బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రాణించారు. డెన్మార్క్‌ బ్యాడ్మింటెన్‌ ప్లేయర్‌ మథియస్‌ బోతో, తాప్సీ ప్రేమించుకుంటున్నారు. గతేడాది ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే రెండు కుటుంబాల సమక్షంలో ఉదరుపూర్‌లో వీరి వివాహం జరగబోతుందని సమాచారం.

➡️