దగ్గుబాటి ఇంట పెళ్లి వేడుక

Dec 7,2023 19:05 #abhiram, #movie

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు రెండో కుమారుడు అభిరామ్‌ వివాహం గురువారం జరిగింది. దగ్గుబాటి కుటుంబానికి అత్యంత దగ్గర బంధువుల అమ్మాయి ప్రత్యూషను ఆయన వివాహం చేసుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వివాహ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్‌ వేదికైంది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం నిర్వహించారు. శ్రీలంక నుంచి మరో రెండు రోజుల్లో హైద్రాబాద్‌కి రానున్నారు. వచ్చాక ఇక్కడ రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

➡️