దిల్‌ రాజు డిస్ట్రిబ్యూషన్లో నాని కొత్త చిత్రం

Jan 20,2024 19:10 #movie, #nani

వివేక్‌ ఆత్రేయ నాని కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిపోదా శనివారం’ చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలను దిల్‌ రాజు తీసుకున్నారు. డీవీవీ దానయ్య ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా, ఎస్‌.జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్‌ రాజు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేయబోతున్న విషయాన్ని తాజాగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓ ఫొటో విడుదల చేస్తూ ప్రకటించింది.

➡️