‘ద గోట్‌ లైఫ్‌’ ట్రైలర్‌ విడుదల

Mar 9,2024 19:05 #movie, #prudhviraj sukumar

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం). ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహిస్తుండగా.. అమలాపాల్‌, కేఆర్‌ గోకుల్‌, జిమ్మీ జీన్‌ లూయిస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ రచయిత బెన్యామిన్‌ రాసిన గోట్‌ డేస్‌ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ట్రైలర్‌ విడుదల చేసింది. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. సర్వైవల్‌ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమా పూర్తిగా ఎడారిలో తెరకెక్కిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. ఏఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

➡️