నా పాత్ర సినిమాలో టర్నింగ్‌ పాయింట్‌: ఎస్తర్‌

Dec 14,2023 19:23 #aster, #movie

‘డెవిల్‌’ సినిమా ఒక పీరియడ్‌ డ్రామాగా తెరకెక్కింది. ఇలాంటి పీరియడ్‌ డ్రామా సినిమా చెయ్యడం నా కెరీర్‌లో ఇదే మొదటి సారి. అదీ కాకుండా ఇందులో నా లుక్‌ కూడా వైవిధ్యంగా, 1940లో వుండే పరిస్థితులకు అనుగుణంగా చాలా బాగా ఉంటుంది’ అని నటి ఎస్తర్‌ చెప్పారు. ఇటీవల కన్నడ సినిమా ‘ది వేకెంట్‌ హౌస్‌’ అనే సినిమా ద్వారా దర్శకత్వంలో కూడా తన ప్రతిభని నిరూపించుకున్న ఆమె డెవిల్‌ సినిమా గురించి మాట్లాడారు. ‘డెవిల్‌ సినిమాలో నా పాత్ర ఒక టర్నింగ్‌ పాయింట్‌లా ఉంటుంది. నాకు బాగా నచ్చిన విషయం ప్రధానంగా ఈ సినిమా కథ, ఎంతో వైవిధ్యంగా ఉండటమే కాకుండా, ఇలాంటి కథ ఈమధ్య కాలంలో ఎక్కడా రాలేదు’ అని వివరించారు.

➡️