నా పిల్లలను అలాగే పెంచుతా -దీపికా పదుకొనే

Jan 4,2024 19:16 #depika padukone, #movie

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె పిల్లల పెంపకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న ఆమె తనతో పాటు రణ్‌వీర్‌కు పిల్లలంటే చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా వెల్లడించారు. ‘నేను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తుంటారు. కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలెబ్రిటీలా ట్రీట్‌ చేయరు. సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో.. ఇప్పుడూ అలానే ఉన్నావని అంటుంటారు. మొదట నేను ఒక కూతురిని.. ఒక సోదరిని.. ఆ తర్వాతే సెలబ్రెటీని! ఫేమ్‌ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్‌ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్‌వీర్‌, నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నాం’ అని అన్నారు.

➡️