నిర్మాతగా ఎందుకు సైలెంట్‌ అయ్యాను అంటే..

Dec 26,2023 19:15 #klayan ram, #movie

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘డెవిల్‌’ చిత్రం డిసెంబర్‌ 29న విడుదలవుతోంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో కళ్యాణ్‌రామ్‌ పాల్గంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నిర్మాతగా ఎందుకు సైలెంట్‌ అయ్యాను అనే విషయం మీద స్పష్టత ఇచ్చారు. తనకు నటన అంటే చాలా ఇష్టమని అయితే అది అంత ఈజీ టాస్క్‌ కాదని చెప్పారు. ‘నటన ఈజీ కాదు అనుకుంటాం కానీ నిర్మాణం అంతకన్నా కష్టమైన పని’ అన్నారు. ‘ఒకపక్క నటిస్తూ మరోపక్క సినిమాలు నిర్మించడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టినట్లు అనిపించిందని, ఓం సినిమా తర్వాత ఆ విషయం అర్థం అయి నిర్మాణం మీద పూర్తిగా ఫోకస్‌ తగ్గించాన’ని చెప్పారు.

➡️