పరిశ్రమలో కుల, మత బేధాల్లేవు : పేరరసు

Dec 2,2023 08:41 #movie

‘కుల,మత, జాతి బేధాలు లేనిది చిత్ర పరిశ్రమ. దీనికి నిదర్శనం ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఒక ముస్లిము టెక్నీషియన్‌. జయకాంత్‌- రాజా మొహ్మద్‌లను చూస్తుంటే నాకు విజయకాంత్‌- ఇబ్రహీం రౌథర్‌ కాంబినేషన్‌ గుర్తుకు వస్తోంది. విజయకాంత్‌ విజయంలో ఇబ్రహీంపాత్ర కీలకం. వారిద్దరి మధ్య కుల, మత భేషజాలు లేవు.’అని కోలీవుడ్‌ దర్శకుడు పేరరసు వ్యాఖ్యానించారు. శ్రీ ఆండాల్‌ మూవీస్‌ పతాకంపై పి.వీర అమృతరాజ్‌ నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ జె.రాజా మొహ్మద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మునియాండియిన్‌ మునిప్పాయిస్సల్‌’.జయకాంత్‌ హీరో. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. ఆర్‌వి ఉదయకుమార్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గన్నారు.

➡️