పాన్ ఇండియా చిత్రంగా ‘రికార్డ్ బ్రేక్’ 

Feb 19,2024 17:13 #telugu movies

చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వర్గీయ చలపతిరావు మొదటి రోజు నుంచి సినిమా కోసం నాతోపాటు నిలబడ్డారు. ఆయన డబ్బింగ్ చివరలో చెప్పారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి నాలో సగభాగం అయిన నా దర్శకుడు అజయ్ కే దక్కుతుంది. ఈ సినిమా ఎంత చక్కగా రావడానికి ఈవెంట్ ఇంత బాగా జరగడానికి నాకు ఎప్పుడూ నాకు పక్కనే కొండంతండగా ఉండేది నా ప్రసన్నకుమార్. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు ఈ సినిమాకి మెయిన్ హీరోలు ఆర్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి మ్యూజిక్ కి పనిచేసిన  సాబు వర్గీస్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అతనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ నాలుగు టాకీసులు ఉండేవి. కష్టపడి పుల్లలమ్మి సంపాదించిన డబ్బుల్లో సగం నేను నా స్నేహితులు సినిమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళం. వేటగాడు, అడవి రాముడు, దేవదాసు ఇలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. నా తోటి చిన్న నిర్మాతలు బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలనేది నా కోరిక. నా 5 ఏళ్ల నుంచి ఇప్పటివరకు నాకున్న అనుభవంతో ఒక మంచి కథ సొసైటీ కి ఉపయోగపడే కదా కావాలి అనుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. రీసెంట్ గా కొంతమంది నాతోటి దర్శకులు ఈ సినిమా చూసినవారు రికార్డ్ బ్రేక్ కరెక్ట్ టైటిల్ అని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ వండర్స్ క్రియేట్ చేస్తుంది. లాస్ట్ 45 నిమిషాలు ఈ సినిమా మంచి ఎమోషనల్ గా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరూ ఈ సినిమాను చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

➡️