బన్నీతో అర్జున్‌రెడ్డి తీద్దామనుకున్నా : సందీప్‌ వంగా

2011లో అల్లు అర్జున్‌ (బన్ని)కి ఓ కథ చెప్పాను. కొన్ని కారణాలతో అది ఆగిపోయింది. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి కథను ఆయనను వినిపించాలనుకున్నా. కానీ కలవలేకపోయాను. ఆ స్క్రిప్ట్‌తో చాలామంది నటులు, నిర్మాతలను కలిశాను. చివరకు నేను నిర్మించాను’ అని దర్శకుడు సందీప్‌ వంగా తెలిపారు. తాజాగా ఆయన స్పిరిట్‌ సినిమా ప్రీ పొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉనారు. సామాజిక మాధ్యమాల్లో అర్జున్‌రెడ్డి సినిమా గురించి వివరాలతో ఆయన చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘విజరు దేవరకొండ నాకు ఓ స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యారు. బన్నీని కలవటానికి కుదరకపోవటంతో విజరుతో చేశాను. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది’ అని వివరించారు.

➡️