భరతనాట్యం రెండోపాట విడుదల

Dec 28,2023 19:15 #movie

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో పీఆర్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై పాయల్‌ సరాఫ్‌ నిర్మిస్తున్న భరతనాట్యం సినిమాలోని రెండోపాటను గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్యతేజ ఏలే, మీనాక్షి గోస్వామి హీరోహీరోయిన్లు. సంగీతం : వివేక్‌ సాగర్‌. ‘ఎట్టరో.. ఎట్టెట్ట ఎట్టరో నీ ఉల్టా జాతకం మారేది ఎట్ట… తలరాతలు రాసే వానికే తల తిరిగే కథ నీవి… విధి రాతలు మార్చిన వానినే విసిగించే దశ నీది’ అంటూ సాగిన ఈ పాటను అనంత శ్రీరామ్‌ రాశారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. వైవా హర్ష, అజరుఘోష్‌, హర్షవర్థన్‌, శివన్నారాయణ, సలీం ఫేకు, గంగవ్వ, వంశీ, సంతోష్‌ బాలకృష్ణ, కృష్ణుడు, సత్తన, నాగ మహేష్‌, టార్జాన్‌, మాణిక్‌రెడ్డి తదితరులు నటించారు.

➡️