హీరో విశ్వక్సేన్ నటించిన సినిమా ‘గామి’ మార్చి 8న విడుదల కానుంది. చాందినీ చౌదరి హీరోయిన్. మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశ్వక్సేన్ నటించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. వి.సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. హారిక పెడాడ, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్‌రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్ అందిస్తున్నారు. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.