‘ముఖ్యగమనిక’ సక్సెస్‌ అవుతుంది : విశ్వక్‌సేన్‌

Feb 20,2024 19:23 #movie, #viswaksen

హీరో విరాన్‌ ముత్తంశెట్టి, హీరోయిన్‌గా లావణ్య నటించిన తాజా చిత్రం ‘ముఖ్య గమనిక’ ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందని హీరో విశ్వక్‌సేన్‌ అన్నారు. ఈనెల 23న విడుదల కానున్న ‘ముఖ్యగమనిక’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విశ్వక్‌సేన్‌ హాజరై మాట్లాడారు. ‘విరాన్‌ నేను జిమ్‌ ఫ్రెండ్స్‌. చాలా మంచి వ్యక్తి. వెనుక ఎంతో బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా తన సొంత కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. శివిన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజశేఖర్‌, సాయికృష్ణ నిర్మాతలుగా, వేణు మురళీధర్‌.వి. దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్‌ సంగీతాన్ని అందించారు.

➡️